తల్లి మృతి… అయినా పరీక్షకు హాజరైన కొడుకు
మన భారత్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో హృదయాన్ని కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. బోరజ్ మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన నీలమ్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. కుటుంబాన్ని దుఃఖంలో ముంచెత్తిన ఈ ఘటనలో ఆమె పెద్ద కుమారుడు సాయి ధైర్యం, బాధ్యతాయుత నిర్ణయం అందరినీ కదిలించింది. సాయి ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. ఇదే రోజు అతనికి కీలకమైన చివరి పరీక్ష ఉండటంతో, తల్లి మృతిచెందిన బాధను గుండెల్లో దాచుకుని పరీక్షకు హాజరయ్యాడు. ఒకవైపు తల్లి...