మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మేకల రవికాంత్ యాదవ్ కు ప్రతిష్ఠాత్మక బీపి మండల్ అవార్డు లభించింది. బహుజన అభివృద్ధి దిశగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Bahujan Rajyadhikara Sadhana Samiti మరియు ఉద్య ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డు కార్యక్రమం నిర్వహించబడుతోంది. బీసీల పితామహుడిగా గుర్తింపు పొందిన Bindeshwari Prasad Mandal జ్ఞాపకార్థంగా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.
ఈ నెల 13వ తేదీన Suravaram Pratap Reddy Auditoriumలో నిర్వహించనున్న కార్యక్రమంలో బహుజన మేధావుల చేతుల మీదుగా రవికాంత్ యాదవ్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
సామాజిక సేవ, బహుజనుల అభ్యున్నతి, యువతలో చైతన్యం కల్పించడం వంటి విభిన్న రంగాల్లో రవికాంత్ యాదవ్ గత కొన్ని సంవత్సరాలుగా విశేష కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించడం గర్వకారణమని స్థానిక ప్రజలు, సామాజిక, రాజకీయ విశ్లేషకులు అభినందనలు తెలియజేస్తున్నారు.
తలమడుగు మండలానికి చెందిన యువ నాయకుడికి ఈ స్థాయి గౌరవం రావడం ప్రాంతానికి ప్రతిష్ఠ తీసుకువచ్చిందని పలువురు పేర్కొన్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
