ఆర్టీజన్ కార్మికులతో సీఐటీయూ ధర్నా
మన భారత్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ Centre of Indian Trade Unions (సిఐటియు) ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ఆర్టిజన్ కార్మికుల ఎంప్లాయిస్ యూనియన్ పిలుపుతో కొనసాగుతున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి పొదిల రామయ్య మాట్లాడుతూ, ఆర్టిజన్ కార్మికులు గత ఎనిమిది సంవత్సరాలుగా తమ సమస్యల పరిష్కారం కోసం...