manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 12:32 pm Editor : Editor Vishal Kumar

ఇంటర్ ఫలితాల షాక్.. విద్యార్థిని ఆత్మహత్య

మన భారత్, ఆదిలాబాద్: 

ఆదిలాబాద్ జిల్లా రూరల్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. Utnoor మండలంలోని దంతంపల్లి గ్రామానికి చెందిన సౌజన్య అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సౌజన్య, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో కుటుంబంలోనే కాకుండా గ్రామంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. చేతికొచ్చిన కూతురు ఇలా మృతిచెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

పరీక్షల ఫలితాల వల్ల విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు మానసికంగా బలాన్నివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితాలు ఆశించిన విధంగా రాకపోయినా జీవితం ముందుకు సాగుతుందనే నమ్మకం కల్పించడం అత్యంత అవసరమని చెబుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..