విద్యుత్ శాఖ కార్మికుల సమ్మె షురూ..
మన భారత్, నాగర్ కర్నూలు: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖకు చెందిన ఆర్టిజన్లు సమ్మె బాట పట్టడంతో విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సమ్మె ప్రారంభమైన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆందోళన వాతావరణం నెలకొంది. సుమారు 2000 మంది ఆర్టిజన్లు, అన్‌మ్యాన్ సిబ్బంది, స్పాట్ బిల్లర్లు ఈ సమ్మెలో పాల్గొని విధులను బహిష్కరించారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా...