శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
మన భారత్, ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం బాపురావు కుటుంబ సభ్యులతో కలిసి హుండీలో కానుకలు సమర్పించి, దేశ, రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిసింది. ఆలయ అధికారుల మార్గదర్శకత్వంలో వారు...