ప్రజల భద్రతే ధ్యేయం: ఎస్సై సురేష్
మన భారత్ , మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రజల భద్రతను కాపాడేందుకు పోలీసులు కీలక చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కాలంగా నిరుపయోగంగా ఉన్న 24 సీసీ కెమెరాలను మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ స్వయంగా చొరవ తీసుకొని మరమ్మత్తులు చేయించి తిరిగి పనిచేసేలా పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముప్పు సురేష్ మాట్లాడుతూ, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో మండల...