ఘనంగా విఠల్ రుక్మిణి విగ్రహ ప్రతిష్టాపన..
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో మహార్ సంగం ఆధ్వర్యంలో శ్రీ విఠల్ రుక్మిణి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, సంగం సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన అనిల్ జాదవ్, గ్రామాల్లో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో ప్రజలందరూ కలిసికట్టుగా పాల్గొనడం ఆనందకరమని పేర్కొన్నారు. ఇలాంటి...