మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో మహార్ సంగం ఆధ్వర్యంలో శ్రీ విఠల్ రుక్మిణి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు, సంగం సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన అనిల్ జాదవ్, గ్రామాల్లో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో ప్రజలందరూ కలిసికట్టుగా పాల్గొనడం ఆనందకరమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.
విఠల్ రుక్మిణి దేవతల ఆశీర్వాదం గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ, విటలేశ్వరుని రూపంలోనే వెంకటేశ్వర స్వామి పండరిపూర్‌లో దర్శనమిస్తారని పురాణాలలో పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
అనంతరం గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన కగ్నే పారజి గారి కుమార్తె ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకొని, రాథోడ్ మోహన్ భార్య ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
