పంచాయతీ ట్రాక్టర్ దుర్వినియోగం.!
ధన్వాడ, మన భారత్: ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామపంచాయతీకి చెందిన చెత్త సేకరణ ట్రాక్టర్‌ను కాంట్రాక్ట్ పనులకు వినియోగించడం వివాదాస్పదంగా మారింది. స్థానికంగా జరుగుతున్న మురుగు కాలువ నిర్మాణ పనుల కోసం అవసరమైన సిమెంట్ సంచులను తీసుకురావడానికి పంచాయతీ ట్రాక్టర్‌ను ఉపయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వార్డ్ సభ్యుడు మొగులయ్య తెలిపిన వివరాల ప్రకారం, కొండాపూర్ గ్రామం నుంచి చర్లపల్లి వరకు సిమెంట్ సంచులను చెత్త ట్రాక్టర్‌లో తరలించడం గమనించి, వెంటనే వాహనాన్ని ఆపి పంచాయతీ సిబ్బందిని ప్రశ్నించారు....