manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 5:23 am Editor : manabharath

హ్యాపీ బర్త్ డే యంగ్ లీడర్..

మన భారత్, ఆదిలాబాద్:

కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ, డైనమిక్ నాయకుడు ఓసావార్ వెంకటి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 21 వార్డ్ క్రాంతి నగర్ ప్రజలు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఓసావార్ వెంకటి  ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పని చేస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. పార్టీ పట్ల నిబద్ధతతో పాటు, సామాజిక సేవలో ఆయన చూపిస్తున్న చురుకుదనం విశేషమని పేర్కొన్నారు.

ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న నాయకుడిగా వెంకటి గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన రాజకీయ ప్రస్థానం మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ, ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఓసావార్ వెంకటి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. హ్యాపీ బర్త్ డే డ్యాడీ అంటు తన బంగారు గారాల పట్టి (కూతురు) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

పలుచోట్ల కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా జరిపారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.