మన భారత్, ఆదిలాబాద్ :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. నిర్మల్ (NRML), ఆదిలాబాద్ (ADB) జిల్లాల్లో జరిగే ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
పర్యటనలో భాగంగా సీఎం ఉదయం 11 గంటలకు బాసరలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ పునరుద్ధరణ పనులకు భూమిపూజ చేయనున్నారు.
మధ్యాహ్నం 2:15 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామానికి చేరుకుని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాలు, వివిధ అవార్డులను అందజేయనున్నారు.
ఈ పర్యటన ద్వారా జిల్లాలో అభివృద్ధికి కొత్త దిశలో అడుగులు పడనున్నాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమం అనంతరం సీఎం సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
