manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 5:12 pm Editor : manabharath

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తలమడుగు, మన భారత్:

తలమడుగు మండల కేంద్రంలో బ్లూ భీమ్ యూత్ ఆధ్వర్యంలో మహానేత బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పాల్గొన్న యువకులు మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ సమాజానికి చేసిన సేవలు, ముఖ్యంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి యువతకు ఆదర్శమని తెలిపారు. రాజకీయ రంగంలో ఆయన చూపిన మార్గదర్శకత్వం నేటి తరానికి ఎంతో ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.

ఇక స్థానిక సమస్యల పరిష్కారంలో యువత ముందుండాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ శాఖ అధికారులను ప్రశ్నించే ధైర్యం కలిగి ఉండాలని సూచించారు. మహనీయుల జీవితాలను తెలుసుకుని వాటి నుంచి స్ఫూర్తి పొందినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లూ భీమ్ యూత్ సభ్యులు ఎలుపుల శివ, రాజు, తరుణ్, వినయ్, అజయ్, సందీప్, అఖిల్, శివ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.