అస్సాంలో మంత్రి సీతక్క విస్తృత ప్రచారం..
మన భారత్, అస్సాం: అస్సాం రాష్ట్రంలోని దిబ్రూగర్ జిల్లా నహర్కటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణతీ ఫుకాన్కు మద్దతుగా మంత్రి సీతక్క విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుసుకున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో మహిళలు, యువతతో ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ పట్ల విశ్వాసం పెంచే ప్రయత్నం...