వసతుల లేమితో రోగుల ఇబ్బందులు..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో మౌలిక వసతుల కొరత తీవ్ర సమస్యగా మారింది. రోగులకు అవసరమైన కనీస సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఆరోగ్య కేంద్రంలోని మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల తలుపులు విరిగిపోయి ఉండటం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు....