manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 5:02 am Editor : Editor Vishal Kumar

సచిన్ సావంత్‌కు ఘన సత్కారం..

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు మరింత చురుకుదనం సంతరించుకుంటున్నాయి. జిల్లా కార్యవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన AICC సెక్రటరీ సచిన్ సావంత్‌కు పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీకి చెందిన గుడిపల్లి నగేష్ శాలువాతో సత్కరించి సచిన్ సావంత్‌కు గౌరవం తెలియజేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరగనున్న ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

సమావేశం సందర్భంగా పార్టీ విస్తరణ, ప్రజా సమస్యలపై పోరాటం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై ముఖ్యంగా చర్చించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు నాయకులు కృషి చేయాలని సచిన్ సావంత్ పిలుపునిచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలను అభినందిస్తూ, సమిష్టి కృషితో కాంగ్రెస్‌ను మరింత బలంగా నిలబెట్టాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, పట్టణ కమిటీ సభ్యులు, అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..