క్రమశిక్షణ పై కఠిన హెచ్చరిక: చంద్రబాబు
మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ క్రమశిక్షణ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశం ఇస్తూ, క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కఠినంగా హెచ్చరించారు. ఇటీవల నరసారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు వ్యవహారం నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనకు కావాల్సిన వ్యక్తికి పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు...