పాక్ నుంచి మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
మన భారత్, తెలంగాణ: భారత్–పాక్ సంబంధాలు మరోసారి ఉద్రిక్తతల దిశగా సాగుతున్నాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. భవిష్యత్తులో యుద్ధ పరిస్థితులు ఏర్పడితే భారతీయుల ఇళ్లలోకి చొరబడి హత్యలు చేస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ వైఖరి తీవ్ర విమర్శలకు గురవుతుండగా, ఇలాంటి వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....