manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 4:19 pm Editor : manabharath

అంబేద్కర్ జయంతి వేడుకల పోస్టర్ విడుదల..

మన భారత్, తలమడుగు (బోథ్):

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు, యువతకు విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో ఇంద్రవెల్లి మండల అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జయంతి వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం సమానత్వం, న్యాయం, స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు యువతకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు.

జయంతి వేడుకలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించి అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరించాలన్నారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు సోన్ కాంబ్లే జితేందర్, సభ్యులు అనిల్ రాథోడ్, రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ సత్యరాజ్ ఉపారపు, గౌరవ అధ్యక్షుడు కాంబ్లే మనోజ్, ప్రధాన కార్యదర్శి కాంబ్లే మారుతి, పెద్దలు సావంత్ లహుదాస్, సుద్దోధన్, సంజీవ్, భుజంగ్ తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి