విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు..
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం కుచులపూర్ గ్రామానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు కావడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను తెలియజేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్యలు గత కొంతకాలంగా తీవ్రంగా ఉన్నాయని, తరచూ విద్యుత్ అంతరాయాల వల్ల రైతులు, వ్యాపారులు, గృహ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ...