నేడు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం.!
మన భారత్, ఆరోగ్య డెస్క్: ప్రపంచవ్యాప్తంగా దక్షిణ భారతీయుల ప్రియమైన అల్పాహారం ఇడ్లీకి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ ప్రతి సంవత్సరం మార్చి 30న ప్రపంచ ఇడ్లీ దినోత్సవం (World Idli Day)గా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక దినోత్సవం ఇడ్లీ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటడం లక్ష్యంగా నిర్వహించబడుతోంది. ఎలా ప్రారంభమైంది.? ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని మొదటగా 2015లో తమిళనాడులోని చెన్నైలో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ రోజు ఇడ్లీ ప్రేమికులు, ఆహార ప్రియులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు....