‘తొలి ముద్ద’ను ప్రారంభించిన సీఎం.!
మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలోని అంగన్వాడీ చిన్నారుల పోషణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తొలి ముద్ద’ అనే బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రతిరోజూ ఉదయం పౌష్టికాహారం అందించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చిన్నారుల మానసిక, శారీరక అభివృద్ధికి పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. బాల్యంలో సరైన ఆహారం అందకపోవడం వల్లే అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన...