గవర్నమెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారా.?
మన భారత్, తెలంగాణ: సశస్త్ర సీమా బల్ (SSB)లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 1,060 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 827 కానిస్టేబుల్, 233 హెడ్ కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి. ఈ నియామకాల్లో డ్రైవర్, వెటర్నరీ, టైలర్, బార్బర్, కార్పెంటర్, కమ్యూనికేషన్, ఎలక్ట్రిషియన్, స్టీవార్డ్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ...