manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 9:33 am Editor : manabharath

గవర్నమెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారా.?

మన భారత్, తెలంగాణ: 

సశస్త్ర సీమా బల్ (SSB)లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మొత్తం 1,060 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 827 కానిస్టేబుల్, 233 హెడ్ కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి.

ఈ నియామకాల్లో డ్రైవర్, వెటర్నరీ, టైలర్, బార్బర్, కార్పెంటర్, కమ్యూనికేషన్, ఎలక్ట్రిషియన్, స్టీవార్డ్ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక ప్రక్రియలో భాగంగా శారీరక పరీక్షలు (PET/PST), రాత పరీక్ష, అవసరమైతే స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ దశల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను తుది ఎంపికకు పరిగణలోకి తీసుకుంటారు.

ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssb.gov.in/ ద్వారా ఏప్రిల్ 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం కోసం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే యువతకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.