ఆ టీచర్ ను శిక్షించాలి: పీవోడబ్యు లక్ష్మి
మన భారత్ | నారాయణపేట: నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం మోమినాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయులు అసభ్యకరంగా, అవమానకరంగా ప్రవర్తించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ POW (ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ విమెన్) జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు స్వామిని వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన...