సల్లేశ్వరం జాతర ఎప్పుడో తెలుసా.?
మన భారత్ ,అచ్చంపేట : తెలంగాణలో ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన సల్లేశ్వరం జాతర ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానుంది. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్, లింగాల మండలాల పరిధిలో విస్తరించిన దట్టమైన నల్లమల అరణ్యాల్లో ఈ జాతర వైభవంగా జరుగనుంది. ఏప్రిల్ 2 నుంచి 6వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ పర్వదిన వేడుకలు కొనసాగనున్నాయి. సల్లేశ్వరం క్షేత్రం ఎత్తైన కొండలు, లోతైన లోయల మధ్యన ప్రకృతి...