బాలికపై అసభ్య ప్రవర్తన.. టీచర్ ను తొలగించాలి
మన భారత్, నారాయణపేట: మద్దూర్ మండలంలోని మోమినాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సి. స్వామిని వెంటనే విధుల నుండి తొలగించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను వాట్సాప్లో విద్యార్థినిలకు పంపి వైరల్ చేసిన మరో ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డిపై కూడా కఠిన చర్యలు తీసుకుని విధుల నుండి తొలగించాలని కోరారు. ఈ మేరకు గురువారం నారాయణపేట...