బీసీల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ..
మన భారత్, తెలంగాణ: బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ, సంక్షేమంపై ప్రభుత్వ దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమీపంలోని ఘన్‌పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని మద్దతు తెలిపారు. నిరసన సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీ వర్గాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపించారు. విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో బీసీలకు సరైన వాటా కల్పించాలని, సంక్షేమ పథకాలను...