అసెంబ్లీ స్థానాల పెంపు పై చర్చ.!
మన భారత్, ఆదిలాబాద్,: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు భవిష్యత్తులో 15కు పెరిగే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఆశావహుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జనాభా పెరుగుదల, భౌగోళిక విస్తీర్ణం, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సరిహద్దుల్లో మార్పులు జరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా...