జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బొల్లారపు బాబన్న నియామకం
మన భారత్: తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బొల్లారపు బాబన్నను నియమించిన సందర్భంగా తలమడుగు మండల కాంగ్రెస్ నాయకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎప్పటికప్పుడు గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. అదే క్రమంలో బాబన్నకు జిల్లా ఉపాధ్యక్ష పదవి లభించడం ఆయన సేవలకు నిదర్శనమని అన్నారు....