విత్తనాలపై రైతులకు అవగాహన సదస్సు
మన భారత్, తలమడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తలమడుగు మండలంలోని సాయి లింగి గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు పలు ముఖ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పంటల దిగుబడిని పెంచుకోవాలంటే రైతులు తప్పనిసరిగా నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. మార్కెట్లో నకిలీ విత్తనాలు విస్తృతంగా అందుబాటులో ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గుర్తింపు...