ఇరుకు వంతెనతో ఇబ్బందులు తప్పేనా.?
మన భారత్,తాంసి: తాంసి మండలంలోని పొన్నారి శివారులో ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై ఇరుకు వంతెన కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి రద్దీ ఎక్కువగా ఉండే ఈ మార్గంలో వంతెన సన్నగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఒకేసారి రెండు వాహనాలు సురక్షితంగా దాటేందుకు సరిపడా వెడల్పు లేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం పెరుగుతోంది. ముఖ్యంగా భారీ వాహనాలు, లారీల రాకపోకల సమయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. దీంతో...