భగత్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్
మన భారత్, అచ్చంపేట: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో మండల మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా విప్లవ యోధుడు Bhagat Singh 95వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వర్ధం సైదులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన ధైర్యవంతుడని...