బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలు..
మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఘన్ పార్క్ వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ “బడాయిలు చాలించు - బకాయిలు చెల్లించు” అనే నినాదాలతో ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని ప్లేకార్డు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడకూడదని,...