“రేవంత్ సర్కార్ చేసిన హత్యనే”.. కేటీఆర్
మన భారత్, తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ) గ్రామానికి చెందిన తుడుం గణపతి అనే రైతు తన పంటను ప్రభుత్వం కొనకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన KTR, “ఇది ఆత్మహత్య కాదు.. రేవంత్ సర్కారు చేసిన హత్య” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం...