అంగన్వాడీ టీచర్లకు కొత్త స్మార్ట్ఫోన్లు..
మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా సేవల సమాచారాన్ని సమర్థంగా నమోదు చేయడానికి అవసరమైన కొత్త స్మార్ట్ఫోన్లు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన మొబైల్ ఫోన్లు పాతబడిపోవడంతో పనితీరు మందగించిందనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సమాచారం ప్రకారం, రాబోయే పది రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫోన్లను పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది....