ఎయిర్ పోర్ట్ ప్రారంభించిన కేంద్రమంత్రి..
మన భారత్, విశాఖపట్నం: దేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభిస్తున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ప్రస్తుతం అత్యంత సురక్షితమైన మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు. గతంలో విమాన ప్రయాణం పరిమిత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు...