బడ్జెట్లో ప్రకటన..రూ.5 లక్షల భద్రత
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుభవార్త అందించారు. రాష్ట్రంలో “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం”ను ప్రవేశపెడుతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సందర్భంగా ఈ కీలక నిర్ణయం వెల్లడించారు. రూ.5 లక్షల జీవిత బీమా వర్తింపు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు....