తెలంగాణ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట
మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో సంక్షేమ పథకాల అమలుకు భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై దృష్టి సారిస్తూ మొత్తం ₹50,713 కోట్లను ప్రభుత్వం కేటాయించడం విశేషం. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు వంటి అన్ని వర్గాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ రూపుదిద్దుకుంది. రైతుల సంక్షేమానికి కీలకమైన “రైతు భరోసా” పథకానికి ₹18,000 కోట్లు కేటాయించారు. అలాగే మహిళల సాధికారత కోసం “చేయుత”...