వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్-2028 భారత్‌కు
మన భారత్, న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ మరో కీలక మైలురాయిని అందుకుంది. వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2028 నిర్వహణకు ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నిర్వహణ కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య గట్టి పోటీ నెలకొనగా, చివరికి భారత్‌కే అవకాశం దక్కడం విశేషంగా నిలిచింది. ఈ పోటీల నిర్వహణకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరాన్ని ఎంపిక చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతులు, క్రీడా సదుపాయాలు పరిశీలించిన అనంతరం...