నీటి ఎద్దడి నివారణకు చర్యలు.!
మన భారత్, భీంపూర్: వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామంలో స్థానిక సర్పంచ్ దాసరి రమేష్ చర్యలు చేపట్టారు. గ్రామ ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 5వ వార్డులోని ఉర్దూ ప్రాథమిక పాఠశాల సమీపంలో కొత్త బోరు ఏర్పాటు చేయించారు. సుమారు రూ.50 వేల వ్యయంతో తవ్వించిన ఈ బోరులో సమృద్ధిగా నీరు లభించడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు నీటి కొరతతో...