తిరుమల చారిటబుల్ సేవలు మరువలేనివి..
మన భారత్, తలమడుగు: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు బండ అనిల్ కుమార్ నేతృత్వంలో రైల్వే స్టేషన్ , బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రయాణికులకు, అవసరమైన వారికి ఉచిత భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఉగాది పండుగ సేవా భావాన్ని మరింత పెంపొందించే సందర్భంగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆకలితో ఉన్న వారికి...