గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు: కలెక్టర్
మన భారత్, తలమడుగు: మండలం ఖోడద్ గ్రామ అభివృద్ధికి గ్రామం నుంచి ఎదిగిన ఉద్యోగులు చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. గ్రామ ప్రజల విజ్ఞానాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నూతన గ్రంథాలయం గ్రామానికి ఒక కొత్త దిశ చూపుతుందని ఆయన అన్నారు. మంగళవారం తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాన్ని పరిశీలించి అక్కడ...