చలివేంద్రం ప్రారంభించిన హనుమాన్ యూత్..
మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జై హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం (చల్లని తాగునీటి కేంద్రం)ను ప్రారంభించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, గ్రామస్తులు, ప్రయాణికులు ఎండాకాలంలో డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యువకులు ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది....