ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు..
మన భారత్, జాబ్ న్యూస్: దేశ సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న యువతకు మంచి అవకాశాన్ని Indian Navy ప్రకటించింది. నౌకాదళంలో అగ్నివీర్ (SSR) పోస్టుల భర్తీ కోసం అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు నాలుగు సంవత్సరాల పాటు అగ్నివీర్ విధుల్లో సేవలందించనున్నారు. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని ఆశించే యువతకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు....