మన భారత్, జాబ్ న్యూస్:
దేశ సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న యువతకు మంచి అవకాశాన్ని Indian Navy ప్రకటించింది. నౌకాదళంలో అగ్నివీర్ (SSR) పోస్టుల భర్తీ కోసం అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 10+2 అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు నాలుగు సంవత్సరాల పాటు అగ్నివీర్ విధుల్లో సేవలందించనున్నారు. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని ఆశించే యువతకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులుగా పరిగణిస్తారు.

వయస్సు పరిమితి
అభ్యర్థులు డిసెంబర్ 2004 నుంచి అక్టోబర్ 2009 మధ్య జన్మించి ఉండాలి. ఈ వయస్సు పరిమితిని తప్పనిసరిగా పాటించాలి.
ఎంపిక విధానం
ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (PFT)
- మెడికల్ టెస్ట్
ఈ మూడు దశల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులు తుది ఎంపికకు అర్హులవుతారు.

దరఖాస్తు విధానం
ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 14 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.550 + GST గా నిర్ణయించారు.
దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్: http://joinindiannavy.gov.in
ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

దేశ సేవతో పాటు మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే యువతకు భారత నౌకాదళ అగ్నివీర్ నియామకాలు ఒక గొప్ప అవకాశంగా నిపుణులు చెబుతున్నారు.
