వాహనదారులకు పోలీసుల అవగాహన..
మన భారత్, ఆదిలాబాద్: రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు ప్రత్యేకంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ తనిఖీలలో వాహనదారుల పత్రాలు, హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని,...