మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలో గోన్టిముక్కుల సాయి రిత్విక్ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య ఆనందోత్సాహాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి రిత్విక్ కు పలువురు బంధువులు, స్నేహితులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి రిత్విక్ తల్లిదండ్రులు ప్రసాద్, కీర్తి పాల్గొని కుమారుడికి ఆశీర్వాదాలు అందించారు. అలాగే అన్న అరవింద్, మామ అశోక్, బాబాయి చింటూ, తమ్ముళ్లు–చెల్లెళ్లు రిషి, మిన్ను, నిత్య, విన్యాసిరి, సాత్విక్, సాయి వినీత్ తదితర కుటుంబ సభ్యులు పాల్గొని సాయి రిత్విక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సాయి రిత్విక్ భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. వేడుకలు సంతోషభరిత వాతావరణంలో సాగాయి.

