రీఛార్జ్ ముగిసినా ఇన్కమింగ్ ఆపొద్దు.. ఎంపీ
మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని Raghav Chadha డిమాండ్ చేశారు. మొబైల్ సేవా సంస్థలు అమలు చేస్తున్న రీఛార్జ్ విధానాలు వినియోగదారులకు భారంగా మారుతున్నాయని ఆయన విమర్శించారు. పార్లమెంట్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం టెలికాం కంపెనీలు “మంత్లీ ప్లాన్స్” పేరుతో 28 రోజుల రీఛార్జ్ ప్లాన్‌లు అందిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో వినియోగదారులు ఒక సంవత్సరంలో 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని తెలిపారు. ఇది...