13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు.
9.32 కోట్ల మందికి రూ.2 వేల చొప్పున జమ మన భారత్ ,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థికంగా తోడ్పడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ (PM-Kisan) పథకం కింద మరో విడత నిధులు విడుదలకు సిద్ధమయ్యాయి. మార్చి 13న ఈ పథకం కింద 22వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుంది. ఈ విడతలో సుమారు 9.32...